Header Banner

డెల్టా రైతుల నుదిటి రాతలు మార్చిన అసమాన్యుడు! 222 వ జయంతి సందర్భంగా..

  Thu May 15, 2025 14:16        Politics

గోదావరి, కృష్ణా డెల్టాల రూపశిల్పి సర్ ఆర్ధర్ కాటన్ 222 వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడలోని జలవనరుల శాఖ ఆవరణలోని కాటన్ విగ్రహానికి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు,రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. 1852లో కాటన్ ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో అపర భగీరథుడుగా మిగిలి ఘనకీర్తిని సంపాదించుకున్నారని దేశ చరిత్రలో తొలిసారిగా కృష్ణ, గోదావరి డెల్టా లా వ్యవస్థను కాల్వల ద్వారా ఆయకట్టు, డ్రైనేజ్ పద్ధతిలో నిర్మించి మార్గదర్శకులైనారన్నారు.


1840 లో నే కృష్ణానదిపై ఆనకట్ట ప్రతిపాదనలు బ్రిటీష్ ప్రభుత్వానికి పంపించి సిఫారసు చేయటమే కాకుండా ధవళేశ్వరం బ్యారేజ్ పూర్తి అయిన తర్వాత కృష్ణా నదిపై ఆనకట్టను నిర్మించారనారు. అందుకే గోదావరి, కృష్ణ డెల్టా ప్రాంత ప్రజలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదటిగా అన్నం పెట్టిన వాడే దేవుడిగా భావించి కాటన్ మహాశయుడిని స్మరించుకోవడం జరుగుతుందన్నారు.

 

 ఇది కూడా చదవండివైసిపికి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!

 


సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే కాటన్ వందలాది మైళ్లు గుర్రంపై తిరిగి ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేశారని, ఈ ప్రాంత ప్రజలు తినే తిండిలో, తాగే నీటిలో, ఈ ప్రాంత అభివృద్ధిలో వెల్లివిరిసిన నాగరికతలో ఆయనే కనపడతారని, రైతు వ్యవసాయానికి అనుకూలంగా కృష్ణా, గోదావరి డెల్టాలను ఆధునికీకరణ చేసి నీటి వృధాను తగ్గించి, కాటన్ మహాశయుని ఆశయాలు కాపాడి మన ముందు తరాలకు అందించడమే ఆయనకు మనం అందించే నివాళి అన్నారు.


కాటన్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రస్థుత ఎన్.డి.ఎ. ప్రభుత్వం లో రాష్ట్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో రాష్ట్రా జలవనరుల శాఖ మంత్రి వర్యులు డా. నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో గోదావరి నీటి వృధాను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 50 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయలు నిధులు సాధించి ప్రోజెక్టు ను 194 టీ.ఎం.సీ. లు 45.72 మీటర్ల ఎత్తులో పూర్తిస్థాయిలో త్వరగా నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవటం అభినందనీయం అన్నారు.

 

ఇది కూడా చదవండివైసీపీకి దిమ్మదిరిగే షాక్! మాజీ మంత్రిపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SirArthurCotton #ArthurCottonJayanti #ApBhageeratha #GodavariKrishnaDelta #Jalayagnam